నెల్లూరు గ్రామీణం, జులై 14
నారాయణ విద్యాసంస్థల మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం కూడా నిర్వహించారు.
దేశ విదేశాల్లో పేరుగాంచిన నారాయణ విద్యాసంస్థల మేనేజర్ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు పట్టణంలో హరినాధపురం, ఎల్ఐసి కాలనీలలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణంలోని అతిరథ మహారథులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వచ్చిన అతిథులకు బాజీ భజంత్రీలతో, గజమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రక్తదానం కూడా నిర్వహించారు. వేద పండితులు వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. విచ్చేసిన అతిథులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అతిథుల రాకతో కొద్దిసేపు ట్రాఫిక్ కూడా ఏర్పడింది.
ఈ సందర్భంగా వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తన జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు చెబుతూ, ఈ జన్మదిన వేడుకలు మరువలేనివని అన్నారు. తనకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తే, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుంటామని ఆయన ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేశారు.











