Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 23
బాపట్ల జిల్లా చీరాలలోని BRK హై స్కూల్ లో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. శక్తి యాప్ వినియోగం, సైబర్ క్రైమ్స్, ఫోక్సో చట్టం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ వాడకం వంటి అంశాలపై అధికారులు కీలక సూచనలు చేశారు.
బాపట్ల జిల్లా చీరాలలోని BRK స్కూల్ నందు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించారు. చీరాల మండలంలోని చీరాల శక్తి టీం కొత్తపేటలోని BRK హై స్కూల్ నందు, అధికారుల ఆదేశాల మేరకు శక్తి టీమ్ సభ్యులు CH. సునీత, మరియు BRK స్కూల్ ప్రిన్సిపాల్ బి. రాధాకృష్ణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ మాధవి మేడం, కొంతమంది టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 150 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యురాలు, శక్తి యాప్ గురించి, ఆపద సమయంలో దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు. అలాగే సైబర్ క్రైమ్స్, మైనర్ డ్రైవింగ్, ఫోక్సో చట్టం, ముఖ్యంగా హెల్మెట్ వాడకం గురించి వివరించారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ ను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. సెల్ ఫోన్లు చూడకుండా ఉన్నవారు అనేక పరీక్షలలో టాపర్లుగా నిలిచారని, కాబట్టి ప్రతి విద్యార్థి సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించాలని, వాట్సాప్ లలో, డిపి లలో తమ ముఖచిత్రాలను పెట్టరాదని తెలియపరిచారు. గాంజా వాడకం గురించి కూడా వివరించారు.
మైనర్ డ్రైవింగ్ చేస్తే 25 వేల రూపాయల జరిమానా కట్టవలసి వస్తుందని, ముద్దాయిలు అవుతారని తెలియపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలని, తల్లిదండ్రులను, టీచర్లను గౌరవించాలని, మంచిగా చదువుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాల్, వైస్ ప్రెసిడెంట్, టీచర్లు, విద్యార్థులందరికీ శక్తి టీం సభ్యురాలు CH. సునీత ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు BRK స్కూల్ యాజమాన్యానికి శక్తి టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.











