Bapatla/Karamchedu (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 01
చీరాల మండల పరిధిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ జరిగింది. గత సంవత్సరం నిర్వహించిన స్క్రీనింగ్ క్యాంపులో గుర్తించిన 21 మంది పిల్లలకు వీల్ చైర్లు, చెవిటి మిషన్లు, టిఎల్ఎం కిట్లు వంటివి అందజేశారు. మండల విద్యాశాఖ అధికారులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చీరాల మండల పరిధిలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గత సంవత్సరం ఏఆర్ఎంహెచ్ లో ఉపకరణాల కొరకు స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో 21 మంది పిల్లలకు ఉపకరణాలు అవసరమని గుర్తించారు. ALIMCO ద్వారా వీల్ చైర్లు, చెవిటి మిషన్లు, టిఎల్ఎం కిడ్స్ వంటి ఉపకరణాలను అందించారు. మండల విద్యాశాఖ అధికారులు రమాదేవి, సుధారాణి కలిసి పిల్లలకు ఈ ఉపకరణాలను అందజేశారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అందించిన టిఎల్ఎం కిట్లు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో ఐఈఆర్టీలు డి.రాజశేఖర్ బాబు, వి.నరసింహం, ఎంపీపీ ఎస్.భావన, రుషిపేట హెచ్ఎం లక్ష్మీనారాయణ, గవినివారి పాలెం హైస్కూల్ లోని స్పెషల్ ఇండికేటర్ జి.ఏసోబు పాల్గొన్నారు.












