బాపట్ల, 1-7-26
చీరాలలో N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ 36వ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా. భిదాన్ చంద్ర రాయ్ (డా.బి.సి. రాయ్) పుట్టినరోజు, వర్ధంతి రోజుని పురస్కరించుకొని నలుగురు వైద్యులను ఘనంగా సన్మానించారు. డా. బాబూరావు, డా. A. శంకరరెడ్డి, డా. మద్దాల వెంకట రమణారావు, డా. డేగల శ్రీనివాస్ లను సత్కరించారు.
N.R.& P.M. హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాలలో రోటరీ కమ్యూనిటీ హాలు నందు జాతీయ 36వ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డా. బాబూరావు మాట్లాడుతూ, మహాత్మాగాంధీ వ్యక్తిగత వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, భారతరత్న అవార్డు గ్రహీత, 14 సంవత్సరములు పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డా. భిదాన్ చంద్ర రాయ్ (డా.బి.సి. రాయ్) పుట్టినరోజు, వర్ధంతి రోజుని పురస్కరించుకొని 1991 నుండి డాక్టర్స్ డే జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నలుగురు వైద్యులు డా. బాబూరావు, డా. A. శంకరరెడ్డి, డా. మద్దాల వెంకట రమణారావు, డా. డేగల శ్రీనివాస్ లను ఘనంగా సత్కరించినట్లు చెప్పారు.
పోలుదాసు రామకృష్ణ మాట్లాడుతూ, తల్లిదండ్రులు జన్మనిస్తే, పునర్జన్మ నిచ్చేది డాక్టర్లని, బ్రతికించే దేవుళ్ళని అన్నారు. కరోనా సమయంలో వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేసిన డాక్టర్లను సత్కరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, గెల్లి తుకారాం, సుభాషిణి, బాల వెంకటేశ్వరరావు, శీరాం రమేష్, చుక్కా శ్రీనివాసరావు, డి.వి.సురేష్, గుద్దంటి రమేష్, జి.వై.ప్రసాద్, యం.శ్రీనివాసరావు, వీరాంజనేయులు, నారాయణరావు, తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.











