బాపట్ల, 2026-07-01
విద్యార్థులు సమస్యలకు ఆత్మహత్య చేసుకోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని వేటపాలెం మండల సీడీపీఓ ఝాన్సీ అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, క్రీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో "ఆత్మహత్యల నివారణ – అవగాహన కార్యక్రమం" జరిగింది.
విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా నిరాశకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఆత్మహత్య ఎప్పటికీ సమస్యలకు పరిష్కారం కాదని వేటపాలెం మండల సీడీపీఓ ఝాన్సీ అన్నారు.
బాపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు క్రీడ్స్ స్వచ్ఛంద సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చీరాలలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో "ఆత్మహత్యల నివారణ – అవగాహన కార్యక్రమం" నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి. పుష్పరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఝాన్సీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం, కుటుంబ లేదా వ్యక్తిగత సమస్యల కారణంగా మానసికంగా కుంగిపోవద్దని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, అధ్యాపకులు, స్నేహితులు లేదా కౌన్సిలర్లతో మాట్లాడి పరిష్కార మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఆత్మహత్య అనేది ఎప్పటికీ సరైన మార్గం కాదని విద్యార్థులకు వివరించారు.
జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొంటూ లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి తమ కుటుంబానికి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో క్రీడ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ దేవరపల్లి డేవిడ్ రాజు, సఖి వన్ స్టాప్ సెంటర్ కౌన్సిలర్ బేబీ, డీబీఆర్సీ కోఆర్డినేటర్ వి. భగవాన్ దాస్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












