గుంటూరు, 2026-11-20
బాపట్ల మున్సిపల్ చైర్మన్ పదవికి స్థానిక అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్ 'మన బాపట్ల మన భవిష్యత్తు, మన ఓటు మన హక్కు' నినాదంతో ప్రచారం ముమ్మరం చేశారు.
మన బాపట్ల మన భవిష్యత్తు, మన ఓటు మన హక్కు అనే నినాదంతో స్థానిక అభ్యర్థిని గెలిపించుకుని, బాపట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పేర్లి సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ బలపరిచిన అభ్యర్థిగా, తాను బాపట్ల మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నట్లు పేర్లి సునీల్ కుమార్ తెలిపారు. స్థానికుడిగా బాపట్ల ప్రజల సమస్యలు, పట్టణ అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. అనుభవం, అంకితభావంతో బాపట్ల అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచిన తనకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
మనవాడిగా, మనలో ఒకడిగా భావించి తనను ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26వ తేదీ గురువారం జరగనున్న పోలింగ్లో తన ఎన్నికల గుర్తు కప్పుసాసర్ పై ఓటు ముద్రించి, అఖండ విజయాన్ని అందించాలని పేర్లి సునీల్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు. మన బాపట్ల మన భవిష్యత్తు, మన ఓటు , మన హక్కు స్థానిక అభ్యర్థిని గెలిపించుకుందాం, మన ఆత్మగౌరవాన్ని నిలుపుకుందాం అనే నినాదంతో ఆయన ఎన్నికల ప్రచార విజ్ఞప్తి చేశారు.







