క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-20
బాపట్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, తాను బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు కోసం దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వార్డుల్లో కార్యకర్తల నినాదాలు, ప్రజల సందడితో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది.
బాపట్ల: పట్టణంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ తన బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార రంగంలో దూసుకెళ్తున్నారు. వార్డుల్లో అడుగుపెట్టిన ప్రతిచోటా కార్యకర్తల నినాదాలు, ప్రజల సందడితో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వీధివీధినా ప్రచార హడావుడి కనిపిస్తోంది. ప్రచారానికే పరిమితం కాకుండా, అన్నం సతీష్ ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి గడపను తొక్కుతూ ప్రజలను పలకరిస్తూ, తన బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాకుండా, ఓటర్లకు ఎన్నికల గుర్తులపై స్పష్టత కల్పించేందుకు ప్రత్యేకంగా కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కౌన్సిలర్ అభ్యర్థులకు కేటాయించిన గ్యాస్ సిలిండర్ గుర్తు, చైర్మన్ అభ్యర్థి ప్యార్లీ సునీల్‌కు కేటాయించిన కప్పుసాసర్ గుర్తు గురించి ఓటర్లకు వివరిస్తూ, గుర్తులను మరచిపోకుండా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
ఒకవైపు అభ్యర్థులతో కలిసి ప్రచారం, మరోవైపు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవడం.. ఇలా అన్నం సతీష్ ప్రచారాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రచారంలో కనిపిస్తున్న కార్యకర్తల ఉత్సాహం, ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ఇండిపెండెంట్ అభ్యర్థుల శిబిరంలో కొత్త జోష్ నింపుతోంది. ప్రచారంలో తగ్గేదేలే అన్నట్లుగా వార్డులన్నీ చుట్టేస్తూ, ప్రతి ఓటరును కలుస్తూ అన్నం సతీష్ ప్రభాకర్ సాగిస్తున్న ప్రచారం బాపట్ల రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.







