క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-22
పట్టణాల సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ.
పట్టణాల సమగ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధి తెలుగుదేశం, జనసేన పార్టీల కలయికతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ అన్నారు. తాడిగడప మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ వార్డులోని యనమలకుదురు, డొంక రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రజలను ఇంటింటికి వెళ్లి కలుసుకుని రాజేంద్రప్రసాద్ గారు ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలకు అవసరమైన మంచి డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, నాణ్యమైన రహదారులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
20వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్ము అశోక చక్రవర్తిని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీతాగోపీచంద్ గారిని, సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేంద్రప్రసాద్ గారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి తుమ్ము అశోక చక్రవర్తి, పార్టీ వార్డ్ ఇన్చార్జిలు రాజుల పార్టీ ఫణి, సయ్యద్ అజ్మతుల్లా బాబు, 20వ వార్డు టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు, బూత్ ఇన్చార్జిలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







