క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టంగుటూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టంగుటూరులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 20వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న బొమ్మెల మునీంద్ర, సర్పంచ్ అభ్యర్థి బెల్లం జయంత్ బాబుకు మద్దతుగా బాపూజీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ ప్రచారంలో కామని విజయ్ కుమార్, కామిని శ్రీనివాసరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
సర్పంచ్ అభ్యర్థి బెల్లం జయంత్ బాబుకు కేటాయించిన కత్తెర గుర్తుపై, 20వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తున్న బొమ్మెల మునీంద్రకు కేటాయించిన స్టూలు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమకు అవకాశం కల్పించాలని ప్రచారం ద్వారా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.







