నెల్లూరు గ్రామీణం, 16 November
11వ కార్తీక మాస లక్ష దీపోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టారు.
11వ కార్తీక మాస లక్ష దీపోత్సవ నిర్వహణకు శ్రీకారం చుట్టారు. పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సోమవారం వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం లక్ష దీపోత్సవం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వీపీఆర్ ఫౌండేషన్ నిర్వహణలో , 6 తేదీల్లో లోని వీఆర్సీ గ్రౌండ్స్‌లో ఈ ఆధ్యాత్మిక వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
11 ఏళ్లుగా దీపోత్సవాలు
ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులు మాట్లాడుతూ.. పరమశివుని అనుగ్రహం, ప్రజల సహకారంతో లో వరుసగా 11వ సంవత్సరం కార్తీక మాస లక్ష దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా కొంత జాప్యం జరిగినప్పటికీ, భక్తులందరికీ కనువిందు చేసేలా ఉత్సవాలను నిర్వహిస్తామని వెల్లడించారు.
భక్తులకు కనువిందుగా ప్రత్యేక ఆలయ నమూనాలు
ఈ ఏడాది ఉత్సవాల్లో రామేశ్వరం జ్యోతిర్లింగం, అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి నమూనా క్షేత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తెలిపారు. ప్రధాన ఆకర్షణగా నిలిచే 9 అడుగుల భారీ శివలింగానికి భక్తులందరూ స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. మూడు రోజుల పాటు పరమశివునికి ప్రీతిపాత్రమైన దీపారాధన, రుద్రాభిషేకం, భస్మాభిషేకం వంటి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు
లక్ష దీపోత్సవ ప్రారంభం: పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా వీఆర్సీ గ్రౌండ్స్‌లో లక్ష దీపోత్సవం ప్రారంభం కానుంది. వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది.
విశేష అభిషేకాలు, అర్చనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి 108 మంది దంపతులతో 108 కేజీల తేనెతో విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు, రుద్రహోమం నిర్వహించనున్నారు. అదే రోజు లక్ష్మీనరసింహ స్వామివారికి గంధం అలంకరణ మహోత్సవం, లక్ష తులసీ అర్చన జరగనున్నాయి.
చండీహోమం, సామూహిక వ్రతాలు: చండీహోమంతో పాటు 501 మంది దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుంది. శ్రీశైలం నుంచి తీసుకువచ్చే ఉత్సవమూర్తులతో శివపార్వతుల కల్యాణ మహోత్సవం జరగనుంది. ఈ మూడు రోజుల పాటు ప్రముఖ స్వామీజీల ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించనున్నాయి.
కార్తీక మాసంలో నిర్వహించే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకల్లో జిల్లా ప్రజలు, శివభక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమశివుని కృపకు పాత్రులు కావాలని వీపీఆర్ దంపతులు కోరారు. లక్ష దీపోత్సవ నిర్వహణకు సహకరిస్తున్న కమిటీ సభ్యులు, వేద పండితులు, వాలంటీర్లు, అధికారులు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు.






