** (క్రౌన్ హ్యూమన్ రైట్స్) జూలై 16
జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష చేపట్టారు.
జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ఈఆర్ఓలు (EROs), ఏఈఆర్ఓలతో (AEROs) జేసీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ మరియు మ్యాపింగ్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 16,44,193 మంది ఓటర్లకు గాను, 15,49,511 (సుమారు 94.25 శాతం) మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని తెలిపారు.
ఓటర్ల జాబితాలో ప్రస్తుతం ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్టింగ్, డెత్) పేర్లు 5.7 శాతం వరకు ఉన్నాయని, వీటిపై వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బిఎల్ఓ (BLO) వద్ద తమ పరిధిలోని ఓటర్ల జాబితా పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని, డిజిటైజేషన్ మరియు మ్యాపింగ్ వివరాలు నమోదు చేసి ఉండాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా బిఎల్ఓలు సిద్ధం చేసిన ఏఎస్డీ రిజిస్టర్పై సంబంధిత బిఎల్ఓ, తహసీల్దార్ మరియు ఎంపిడిఓలు సంతకాలు చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు మున్సిపల్ కమిషనర్ ఏ. భానుప్రతాప్, గ్రామ/వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి నాయుడు, ఇతర అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు.











