పరమేశ్వరి నగర్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 15
నెల్లూరు నగరంలోని ప్రభుత్వ విద్యావ్యవస్థ రూపురేఖలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మారుస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. నగరంలోని పరమేశ్వరి నగర్లో వక్ఫ్ బోర్డు స్థలంలో రూ. 20 కోట్ల సీఎస్ఆర్ () నిధులతో నిర్మిస్తున్న అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ పనులను రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు, టీడీపీ నేతలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, యువనేత నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా, వీఆర్సీ () స్ఫూర్తితో దాతల సహకారంతో ఇప్పటికే ఆర్ఎస్ఆర్, డీఎస్ఆర్ హైస్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసి, తన కుమార్తె శరణికి ఈ ఆధునీకరణ పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి స్విమ్మింగ్ పూల్ వంటి అంతర్జాతీయ సదుపాయాలతో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభిస్తామని, కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెబుతూ 2028 చివరికల్లా నెల్లూరును దేశంలోనే ఒక మోడల్ సిటీగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పేద పిల్లలకు నాణ్యమైన విద్యను ఆస్తిగా ఇవ్వాలన్న సంకల్పంతో, నారాయణ విద్యాసంస్థల కంటే మిన్నగా ప్రభుత్వ బడులను మంత్రి తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. అంతేకాకుండా, నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా మారుస్తూ, డిస్నీ వరల్డ్ తరహా వినోద కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మేయర్-ఎలెక్ట్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు షేక్ షబానా బేగం, షేక్ కరీముల్లా, పఠాన్ ఎం.డి. జుబేర్ ఉద్దీన్, షేక్ నజీమా, షేక్ షాహీనా, నాయకులు మైనుద్దీన్ భాయ్, జాఫర్, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.





