21వ డివిజన్, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, స్ఫూర్తితో ప్రజలకు పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన అందించడమే లక్ష్యంగా 21వ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల తెలిపారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు, అభివృద్ధి అవసరాల్లో భాగంగా గుర్తించిన మూడు ముఖ్యమైన అంశాలను ఈరోజు కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. 1. చెక్కల కాలువ వద్ద బ్రిడ్జి పునరుద్ధరణ: చెక్కల కాలువ వద్ద ఉన్న బ్రిడ్జి కింద మట్టి కొట్టుకుపోయి కాలువలో కలిసిపోవడంతో, బ్రిడ్జి లోపలి భాగం బలహీనపడి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. ఏ క్షణంలోనైనా బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు వెంటనే పరిశీలించి, అవసరమైన బ్రిడ్జిని పునర్నించాలని ప్రతిపాదించారు. 2. రివాల్ట్ వాల్ పక్కన ప్యారలల్ మార్గం ఏర్పాటు: రౌండ్ తూము సమీపం నుంచి రివాల్ట్ వాల్‌ను ఆనుకుని చిల్డ్రన్స్ పార్క్ వరకు ప్యారలల్ మార్గం ఏర్పాటు చేసి, పార్కుకు నేరుగా అనుసంధానం కల్పించాలని ప్రతిపాదించారు. దీనివల్ల స్థానిక ప్రజలకు రాకపోకలు సులభతరమవడంతో పాటు, పార్కుకు చేరుకునేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది.
3. గుర్రాల మడుగు సంఘం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం: గతంలో గుర్రాల మడుగు సంఘం వద్ద ఏర్పాటు చేసిన రీడింగ్ రూమ్ పక్కనే అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా కలిపి, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో తగినంత స్థలం అందుబాటులో ఉన్నందున కమ్యూనిటీ హాల్ నిర్మిస్తే స్థానికులకు వివిధ సామాజిక, కుటుంబ మరియు సామూహిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలు పలుమార్లు చేసిన అభ్యర్థన మేరకు ఈ అంశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల మాట్లాడుతూ, ఈ మూడు అభివృద్ధి ప్రతిపాదనలను గౌరవనీయులైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి దృష్టికి, సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించి, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపించేలా కృషి చేస్తామని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న పారదర్శకత, నిజాయితీతో కూడిన పాలన, జవాబుదారీతనం తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. 21వ డివిజన్ ప్రజలు తమపై నమ్మకంతో కార్పొరేటర్‌గా సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ పదవిని అధికారంగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావిస్తానని తెలిపారు. ప్రతి సమస్యను బాధ్యతతో స్వీకరిస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని స్పష్టం చేశారు. జనసేన నాయకులు కిషోర్ గునుకుల మాట్లాడుతూ, ప్రజలు తెలియజేసే ప్రతి సమస్యను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. గౌరవనీయులైన మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి సహకారంతో కూటమి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ 21వ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, నూతన కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, నరహరి, విశ్వ, రాజేష్, సుమంత్, శ్రీను, విజయ, వల్లి తదితరులు పాల్గొన్నారు.






