నెల్లూరు అర్బన్, 2026-11-29
త్రిబెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న ఆధునిక డిజిటల్ సేవలు అభినందనీయం కిషోర్ గునుకుల (జనసేన).
త్రిబెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న ఆధునిక డిజిటల్ సేవలు అభినందనీయం కిషోర్ గునుకుల (జనసేన). బిజినెస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, బిల్లింగ్ సాఫ్ట్వేర్, వెబ్సైట్ డిజైనింగ్, వెబ్ మొబైల్ అప్లికేషన్లు, ఆధారిత పరిష్కారాలు, పేరోల్ మేనేజ్మెంట్తో పాటు స్టార్టప్‌లు, వ్యాపారవేత్తలకు ఆధునిక వర్క్‌ప్లేస్‌లను అద్దెకు అందించడం వంటి సేవలను ఒకే వేదికపై అందిస్తున్న 3 బెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కృషి అభినందనీయం. నెల్లూరు నగరంలోని రుత్విక్ ఎన్‌క్లేవ్‌లో భ్లూ బర్డ్స్ సంస్థ అధ్యక్షులు వేముల శివకృష్ణ, వారి కుమారులు వేముల హర్ష, ప్రహర్ష ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరిజిన్ ఇన్నోవేషన్ సెంటర్, 3 బెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాన్ని జనసేన నాయకులు కిషోర్ గునుకుల, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషోర్ గునుకుల మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో యువతకు, విద్యార్థులకు, నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సరికొత్త అవకాశాలను అందించే లక్ష్యంతో ఇలాంటి వినూత్న సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆరిజిన్ ఇన్నోవేషన్ సెంటర్ ద్వారా స్టార్టప్‌లకు కో-వర్కింగ్ స్పేస్, స్టార్టప్ ఇంక్యుబేషన్, నిపుణుల మార్గదర్శకత్వం, బిజినెస్ డెవలప్మెంట్, నెట్వర్కింగ్, నైపుణ్యాభివృద్ధి వంటి సేవలను అందించడం విశేషమని తెలిపారు. కొత్త ఆలోచనలను ప్రోత్సహిస్తూ, యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించి అభివృద్ధి చెందేందుకు అవసరమైన వాతావరణాన్ని ఈ కేంద్రం కల్పిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా 3 బెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్వేర్, డిజిటల్ సేవలను అందించడం అభినందనీయమని కిషోర్ గునుకుల అన్నారు. గతంలో సంప్రదాయ పద్ధతుల్లోనే కొనసాగిన వ్యాపార నిర్వహణకు భిన్నంగా, నేటి ఆధునిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం మంచి పరిణామమని తెలిపారు. ముఖ్యంగా యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు, నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు, స్థానికంగానే ఆధునిక సాంకేతిక సేవలను పొందేందుకు ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువతకు ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడానికి ఇలాంటి ఆవిష్కరణ కేంద్రాలు ఎంతో అవసరం. ఒక మంచి ఆలోచనకు సరైన వేదిక, సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల మార్గదర్శకత్వం తోడైతే అది గొప్ప వ్యాపారంగా ఎదగగలదు. నెల్లూరు యువతలోని ప్రతిభను వెలికితీసి, స్థానికంగా స్టార్టప్ సంస్కృతిని అభివృద్ధి చేయడంలో ఆరిజిన్ ఇన్నోవేషన్ సెంటర్, 3 బెల్ టెక్నాలజీస్ కీలక పాత్ర పోషించాలని కిషోర్ గునుకుల ఆకాంక్షించారు. వేముల శివకృష్ణ, వారి కుమారులు ప్రహర్ష చేస్తున్న ఈ నూతన ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లూరు ప్రజలు, యువ పారిశ్రామికవేత్తలు ఈ సంస్థకు తమ ప్రోత్సాహాన్ని, ఆశీస్సులను అందించాలని కోరుతున్నానని కిషోర్ గునుకుల తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల శివకృష్ణ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు జనసేన నాయకులు ప్రశాంత్ గౌడ్, నాగేంద్రబాలు, విశ్వ, నరహరి, విజయ, ప్రశాంతి, ప్రవల్లిక, అశోక్, బాలాజీ, భవాని, ఆమని తదితరులు పాల్గొని నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.







