కార్యక్రమంలో (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 18
పర్చూరులో పేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్య చికిత్సకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ.3,54,127 సీఎంఆర్ఎఫ్ ఎలోసీ మంజూరైంది. షేక్ మస్తాన్ వారం రోజుల క్రితం షేక్ నన్నే దంపతులకు షశువు జన్మించింది. తక్కువ బరువుతో పుట్టిన చిన్నారికి ఇంక్యుబేటర్లో ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.
పర్చూరు :పేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్య చికిత్సకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ.3,54,127 సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరైంది. పర్చూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి, షేక్ నన్నే దంపతులకు వారం రోజుల క్రితం ఆడ శిశువు జన్మించింది. తక్కువ బరువుతో పుట్టిన చిన్నారికి ఇంక్యుబేటర్లో ప్రత్యేక చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. రోజువారీ కూలి పనులతో జీవనం సాగించే ఆ కుటుంబానికి చికిత్స ఖర్చులు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును కలిసి తమ పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడి, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఎల్ఓసీ మంజూరుకు చర్యలు చేపట్టాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆయన చొరవతో చిలకలూరిపేటలోని వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్నారి చికిత్స కోసం రూ.3,54,127 ఎల్ఓసీ మంజూరైంది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి ఎల్ఓసీ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి దంపతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్, ప్రధాన కార్యదర్శి నరేంద్ర, పర్చూరు పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.












