జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ గారు అధ్యక్షత వహించారు. మాతృ మరణాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ విజయమ్మ అన్నారు.
ప్రతి గర్భిణీ స్త్రీని మొదటినుండి ఫాలోఅప్ చేయడం, హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం ముఖ్యమని తెలిపారు.
డాక్టర్ విజయమ్మ, గర్భిణీ స్త్రీలకు అవసరమైన సూచనలు మరియు సలహాలను సమయానికి అందించాలనే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సమావేశంలో డి సి హెచ్ ఎస్ డాక్టర్ పద్మావతి, ఆఫీస్ సూపర్డెంట్ డాక్టర్ సిద్ధార్థ, మరియు ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.


