అమరావతి, 19 September
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు పరిధిలోని సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీర్మానించింది. మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇతర నిర్ణయాలు
1978 నుంచి జారీచేసిన సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి బ్లాక్ చైన్ కు అనుసంధానించనున్నారు. పరీక్షలు, మూల్యాంకన సిబ్బంది భత్యాన్ని 25 శాతం పెంచడంతో పాటు, థియరీ పరీక్షల్లో 32 పేజీల ఆన్సర్ షీట్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.