శృంగారపేట, ఐక్యనగర్, చీరాల, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 18
చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ఈ పనులలో రూ.7.80 లక్షల ఖర్చు.
పట్టణంలోని మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా, చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ, 33వ వార్డుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. 7వ వార్డు శృంగారపేటలో సెయింట్ మార్క్స్ చర్చి నుంచి శవనం డేవిడ్ ఇంటి వరకు రూ.7.80 లక్షల వ్యయంతో, 33వ వార్డు ఐక్యనగర్లో గుర్రపాటి గోపి ఇంటి నుంచి బండి చిన్నబాబు ఇంటి వరకు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, చీరాల పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











