బుచ్చిరెడ్డిపాళెం (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 22
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కలయకాగొల్లు పంచాయతీకి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు పుత్తేటి శివకుమార్ రెడ్డి, పుత్తేటి మహేష్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరితో పాటు 70 కుటుంబాలు కూడా టీడీపీలో చేరాయి.

నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఆదివారం ఈ చేరికల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జన్మదినోత్సవం రోజునే ఈ చేరికలు జరగడం విశేషం. పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీలో చేరికలు
కోవూరు శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో, పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మరోసారి ఘన విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భరోసా ఇచ్చారు.