చీరాల నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారుల పనితీరు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై చీరాల మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆమంచి కృష్ణమోహన్ శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చీరాల పట్టణంలోని క్రీస్టల్ మెగా మార్టు ప్రాంగణంలో న ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు, కొన్ని శాఖల్లో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు, అధికారుల నిర్లక్ష్యం, ప్రజా సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యం వంటి అంశాలను సమావేశంలో ప్రస్తావించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ భూముల వ్యవహారాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
అలాగే ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములకు సంబంధించిన వ్యవహారాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని కోరనున్నారు. ఆరోపణలకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆమంచి కృష్ణమోహన్ కోరారు.
కాంగ్రెస్ నాయకులకు పిలుపు
ఈ పత్రికా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆమంచి అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశం ద్వారా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై అధికారులు స్పందించేలా ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.











