బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, అఖండ ఫౌండేషన్ అధ్యక్షులు విన్నకోట సురేష్ విజయవాడలో వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధాను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా పలకరించుకుని కొద్దిసేపు ముచ్చటించారు.
స్నేహపూర్వక వాతావరణంలో పలు విషయాలను పరస్పరం చర్చించుకున్నట్లు తెలిపారు. వంగవీటి రాధాను కలవడం సంతోషంగా ఉందని విన్నకోట సురేష్ పేర్కొన్నారు.










