ముసురు తుఫాన్ కారణంగా మండలంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తో పాటు చుట్టుపక్కల గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. విద్యుత్ పునరుద్ధరణలో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం 50 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఒక్క అధికారి లేదా సిబ్బంది కూడా పని చేయడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు కేవలం విద్యుత్ కార్యాలయం వద్ద ఫోటోలకు ఫోజులిచ్చి వెళ్ళిపోతున్నారని, సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడుతున్నారు. విద్యుత్ లేకపోవడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు చుక్క నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో చీకటి, ఉక్కపోత, దోమల బెడదతో చిన్నపిల్లలు, వృద్ధులు అపారమైన అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అనుభవిస్తున్న నష్టాన్ని గానీ, పడుతున్న ఇబ్బందులను గానీ స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆశ్చర్యం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు శనివారం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని, తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో రోడ్డుపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. అధికారులు నేరుగా వచ్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ పోరాటం ఆగదని ప్రజలు తేల్చి చెప్పారు. ఈ ఆందోళనతో రోడ్డుపై రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.












