పల్నాడు, 15 November
చిలకలూరిపేట మున్సిపాలిటీ కార్మికుల కోసం డా. అంజిరెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది కార్మికులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ పరీక్షలతో పాటు మందులను పొందారు.
చిలకలూరిపేట మున్సిపాలిటీ కార్మికుల కోసం డా. అంజిరెడ్డి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది కార్మికులు పాల్గొని ఉచిత వైద్య పరీక్షలు, ఈసీజీ పరీక్షలతో పాటు మందులను పొందారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి బాబు ముఖ్య అతిథిగా హాజరై, జిల్లాలో ఈఎస్ఐ గుర్తింపు పొందిన ఏకైక ఆసుపత్రి డా. అంజిరెడ్డి హాస్పిటల్స్ అని తెలిపారు. ఈఎస్ఐ కార్డు కలిగిన మున్సిపల్ కార్మికులు ఈ సేవలను ఉచితంగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వివిధ విభాగాల నిపుణులైన వైద్యులు కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు. ఈ వైద్య శిబిరం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.


