చిలకలూరిపేట, 15 November
పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు, కారంచేడు, ఇంకొల్లు మండల మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముగ్గురు నాయకుల పేర్లను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు చేశారు. ఈ అవకాశం మార్టూరు, కారంచేడు, ఇంకొల్లు మండల చెందిన పార్టీ నాయకులకు కల్పించారు.
పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు, కారంచేడు, ఇంకొల్లు మండల మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ముగ్గురు నాయకుల పేర్లను పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు చేశారు. మార్టూరు, కారంచేడు, ఇంకొల్లు మండల చెందిన పార్టీ నాయకులకు ఈ అవకాశం కల్పించారు.
మార్టూరు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా వలపర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు షేక్ బషీర్‌ను, ఇంకొల్లు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా ఇంకొల్లుకు చెందిన మైనారిటీ నాయకుడు షేక్ బాబర్ భాషను, కారంచేడు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడిగా దగ్గుబాడు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పటాన్ మహబూబ్ సుభానీని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫార్సు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ, పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆయా మండలాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న నాయకులకు ప్రాధాన్యతనిస్తూ ఈ పేర్లను సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఎంపికైన నాయకులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, మండలాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ ఎంపికతో ఆయా మండలాల టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.





