ముత్తుకూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 16
మండలం పిడతాపోలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫోస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యాలయ శుభారంభ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు సోమవారం హాజరై పాల్గొన్నారు.

విద్యారంగంలో విశేష సేవలు అందించిన కేవీ రత్నం మాస్టారు గారి వారసులు ఏర్పాటు చేసిన ఈ పాఠశాల శుభారంభ కార్యక్రమానికి హాజరైన వీపీఆర్ దంపతులు యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించే లక్ష్యంతో ఫోస్ట్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
నెల్లూరు విద్యారంగంలో ఈ పాఠశాల నూతన ప్రమాణాలను నెలకొల్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్ కృష్ణ కిషోర్ కుమార్తె రోషిణి, అంబికా ఈశ్వర్ దంపతులు ఈ విద్యా సంస్థను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, కేవీ రత్నం మాస్టారు గారు విద్యారంగంలో అందించిన సేవలు, నెలకొల్పిన విలువల వారసత్వాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.