చీరాల, 9 November
చీరాల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన మొగిలి బాబ్జి బ్రెయిన్ స్ట్రోక్ తో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాబ్జి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాబ్జి ఆరోగ్య పరిస్థితిని, వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చీరాల పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన మొగిలి బాబ్జి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య వెంటనే ఆసుపత్రికి వెళ్లి బాబ్జి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాబ్జి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాబ్జికి అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతో మాట్లాడి బాబ్జికి అత్యుత్తమ వైద్య సదుపాయాలతో కూడిన మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. బాబ్జి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉంటూ, అవసరమైన వైద్య సహాయంపై చొరవ చూపిన ఎమ్మెల్యేకు బాబ్జి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






