న్యూఢిల్లీ, ఆగస్ట్ 4, 2026
బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం () మరియు కేంద్రీయ విద్యాలయం () లను ఏర్పాటు చేయాలని కోరుతూ లోక్ సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని న్యూఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
బాపట్ల పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీ సందర్భంగా, బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం (JNV) మరియు కేంద్రీయ విద్యాలయం (KV) ల ప్రాధాన్యతను ఎంపీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల నూతన జిల్లాగా రూపుదిద్దుకున్న నేపథ్యంలో, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన ఉచిత, నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు.
జిల్లాలో ఈ రెండు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ మరియు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరలోనే పూర్తి చేసి, అనుమతులు వేగవంతం చేయాల్సిందిగా ఎంపీ కేంద్ర మంత్రిని కోరారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బాపట్ల జిల్లాలో JNV, KV పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు.
ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే, బాపట్ల జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది.











