బాపట్ల, 14 September
జిల్లాలో పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. వాడరేవుపిడుగురాళ్ల జాతీయ రహదారిపై కారంచేడు పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పండగ వేళ బస్సు ఢీకొని యువకుడి మృతి జిల్లాలో పండగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై కారంచేడు పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మృతుడి ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని గుర్తించడం కష్టంగా మారింది. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










