చీరాల, 2026-08-23
రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. తోటవారిపాలెం గ్రామంలో చీరాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసిఎస్) ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గోదాం, అలాగే పాత గోదాం పునర్నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించి, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. తోటవారిపాలెం గ్రామంలో చీరాల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసిఎస్) ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గోదాం, అలాగే పాత గోదాం పునర్నిర్మాణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని గోదాంను ప్రారంభించారు.
గోదాంల ప్రాముఖ్యత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరచుకోవడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన ఎరువులను నిల్వ చేసుకునేందుకు గోదాం నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైతులకు మౌలిక వసతులు కల్పించడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
పీఏసిఎస్ కృషి అభినందనీయం
చీరాల పీఏసిఎస్ ఆధ్వర్యంలో గోదాం నిర్మాణం, పాత గోదాం పునర్నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. రైతులు తమ పంటలను సరైన సమయంలో నిల్వ చేసుకొని, మార్కెట్లో అనుకూల ధరలు లభించే వరకు భద్రపరుచుకునేందుకు ఈ గోదాంలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో చీరాల పీఏసియస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, బాపట్ల జిల్లా సహాయక అధికారి కె. యల్లమందరావు, పిడిసిసి ఒంగోలు కామేపల్లి సీతారామయ్య, సిఇఓ పిడిసిసి ఒంగోలు కే. లక్ష్మీనారాయణ, డిజియం పిడిసిసి ఒంగోలు, చీరాల నోడల్ ఆఫీసర్ వై. ప్రకాశ్, ఏఎంసి చీరాల చైర్మన్ కౌతరపు జనార్ధన్, కాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనబోయిన రజిని, పందిళ్లపల్లి పిఎసియస్ అధ్యక్షులు పల్లబ్రోలు శ్రీనివాసరావు, అధికారులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.












