చిలకలూరిపేట, 2026-11-25
చిలకలూరిపేట పురపాలక సంఘ నూతన చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి బుధవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ప్రత్యేకంగా పాల్గొన్నారు. నూతన చైర్‌పర్సన్‌ను సాదరంగా ఆహ్వానించి, సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు.
చిలకలూరిపేట పురపాలక సంఘ నూతన చైర్‌పర్సన్‌గా తోట రాజరాజేశ్వరి బుధవారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ప్రత్యేకంగా పాల్గొన్నారు.
సంప్రదాయబద్ధంగా నూతన చైర్పర్సన్ తోట రాజరాజేశ్వరిని షేక్ రఫాని సాదరంగా ఆహ్వానించి, చైర్పర్సన్ సీట్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. తాజా మాజీ చైర్మన్ స్వయంగా విచ్చేసి నూతన చైర్‌పర్సన్‌కు బాధ్యతలు అప్పగించి, అభినందించడంపై తోట రాజరాజేశ్వరితో పాటు స్థానిక కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నూతన చైర్పర్సన్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొని నూతన చైర్‌పర్సన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.







