చీరాల, 2026-11-24
బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినివారిపాలెం గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో బోయిన నాగేశ్వరరావుపై మరోసారి దాడి జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. బోయిన నాగేశ్వరరావుపై బోయిన మోహన్ కృష్ణ, బోయిన హరిబాబు కలిసి దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన నాగేశ్వరరావును చికిత్స నిమిత్తం చీరాలలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
గతంలో ఉన్న వివాదాలే ఈ దాడికి కారణమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.







