కర్నూలు, 2026-11-25
కర్నూలు నగర డిప్యూటీ మేయర్ శ్రీ అంబిలి కాశీ విశ్వనాథ్‌ను వీరశైవ అభ్యుదయ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సమాజ నాయకులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఓం శ్రీ గురుబసవలింగాయ నమః కర్నూలు నగర రాజకీయాల్లో ప్రజాదరణతో, ప్రజాసేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్న నగర డిప్యూటీ మేయర్ శ్రీ అంబిలి కాశీ విశ్వనాథ్ గారికి కర్నూలు వీరశైవ అభ్యుదయ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని సమాజ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా వీరశైవ లింగాయత్ బలిజ సమాజానికి చెందిన వ్యక్తి నగర డిప్యూటీ మేయర్‌గా ఉన్నత రాజకీయ పదవిని చేపట్టడం సమాజానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఆ కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో అంబిలి కాశీ విశ్వనాథ్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి, ప్రజాసేవలో, కర్నూలు నగర అభివృద్ధిలో, సమాజ అభ్యున్నతిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమ వివరాలు
కార్తీక వనభోజన మహోత్సవం 29-11-2026, ఆదివారం ఉదయం 9:00 గంటల నుండి పుష్పరాజ్ ఫంక్షన్ హాల్, రాజీవ్ గృహకల్ప దగ్గర, పెద్దపాడు రోడ్డు, కర్నూలులో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీరశైవులందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.







