ఆవిష్కరించిన (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 23
పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నామినేషన్లను అడ్డుకున్నా, ఓటర్లపై దౌర్జన్యం చేసినా ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు రూపొందించిన గోడపత్రికలు మరియు కరపత్రాలను ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సోమవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఎన్నికల్లో నామినేషన్లను అడ్డగించిన మరియు ఓటు హక్కుపై బెదిరింపులకు గురైన ఎస్సీ, ఎస్టీలు కేసులు పెడితే ప్రభుత్వం 85 వేల రూపాయలు రిలీఫ్ ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ షెడ్యూల్లో ఉందని జిల్లా కలెక్టర్ కు రూల్ పొజిషన్ చూపించారు. అలాగే ఇటీవల ముగిసిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టి, బెదిరించి, పోలీస్ స్టేషన్కు అక్రమంగా తీసుకువెళ్లి ఎస్సీ, ఎస్టీ ఓటు హక్కును అడ్డుకున్నారని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న పంచాయతీ, నామినేషన్లలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను అడ్డుకున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం 3(1)(1) ప్రకారం ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును ఎస్సీ, ఎస్టీలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా వినియోగించుకునే అవకాశాన్ని చట్టపరంగా ఎన్నికల కమిషన్ నిర్వర్తించాలన్నారు. గతంలో ఎన్నికల నామినేషన్లకు అవసరమైన సర్టిఫికెట్లు అన్ని పొందుపరిచిన ఎన్నికల అధికారులకు లంచాలు ఇచ్చి, బెదిరించి కొన్ని సర్టిఫికెట్లను తీసివేసి నామినేషన్ చెల్లలేదని తిరస్కరించే వారన్నారు. కానీ ప్రస్తుతం పోలీసు అధికారుల సమక్షంలోనే నామినేషన్లు వేయటానికి వెళ్లిన మున్సిపాలిటీ గతంలో ఎన్నికలు నామినేషన్లు అయినా ప్రతిపక్ష పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నిర్భయంగా నామినేషన్ వేసుకునేవారన్నారు. కేవలం ఎన్నికల అప్పుడు మాత్రమే కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్, బూత్ ఆక్రమణ మరికొన్ని ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు అమ్ముడుపోయి పోలింగ్ బాక్సులను మార్చేవారన్నారు. కొంతకాలానికి కౌంటింగ్ కేంద్రాల్లో ఒక పార్టీకి వచ్చిన ఓట్లను అధికార పార్టీకి బదలాయించి అధికార పార్టీ అభ్యర్థి గెలిచాడని డిక్లేర్ చేసేవారు అన్నారు. దీనిపై కూడా ఓడిపోయిన అభ్యర్థి రీకౌంటింగ్ జరిపించే వారన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో చేగువేరా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి సనాతన ధర్మం వైపు పయనిస్తూ సనాతన స్టార్ పవనిజం ప్రవేశపెట్టి గతంలో తాను చెప్పిన కమ్యూనిజం, మార్క్సిఇజం, బహుజన వాదాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మోడీ కనుసన్నల్లో చంద్రబాబుకు తాకట్టు పెట్టారన్నారు. గతంలో రాయలసీమలో మాత్రమే ఎన్నికల ఫ్యాక్షన్ ఉండేది అన్నారు. కానీ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు అంబాసిడర్గా పేరుగాంచగా, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లోకేష్ మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారుల ముందే నామినేషన్ కేంద్రాలలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్ చించేయడం, నామినేషన్ పత్రాలను లాక్కెళ్ళడం, పోలీస్ అధికారులను పంపించి నామినేషన్ వేసిన అభ్యర్థులను బెదిరించడం, తప్పుడు పోలీస్ కేసులను పెట్టి అరెస్ట్ చేపించడం లోకేష్ ఇజంగా మారిందన్నారు. హైకోర్టు కూడా అధికార కూటమి ప్రభుత్వ ఎన్నికల అక్రమాలపై స్పందించకపోవడం న్యాయవ్యవస్థ అధికార అక్రమాలకు గొడుగు పట్టడమే అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును రక్షించడానికి ఎన్నికల కమిషన్ మొక్కుబడిగానైన స్పందించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లను తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని, తాము చెప్పిన గుర్తుపైన ఓటు వేయాలని బెదిరించిన, దౌర్జన్యం చేసిన ఎస్సీ, ఎస్టీ చట్టం 3(1)(యం) ప్రకారం నేరమన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఓటర్లను పలానా వర్గానికి లేక కులానికి లేదా పలానా పార్టీకి ఓటు వేయొద్దని బెదిరించడం 3(1)(ఓ) ప్రకారం నేరమన్నారు. అలాగే ఎన్నికల అనంతరం తమ పార్టీకి ఓటు వేయలేదని ఎస్సీ, ఎస్టీ ఓటర్లను సోషల్ మరియు ఎకనామిక్ బాయ్ కాట్ సెక్షన్ 3(1)(ఎన్) ప్రకారం నేరం అన్నారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓటు హక్కును అడ్డుకున్న, దౌర్జన్యం చేసిన ఘటనలపై నమోదైన పోలీస్ కేసు బాధితులకు 85 వేల రూపాయలు ప్రభుత్వం రిలీఫ్ మంజూరు చేస్తుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు ఎస్సీ, ఎస్టీ ఓటర్లకు తెలిపారు. ఎన్నికల అధికారులు ఎన్నికల్లో పచ్చ చొక్కల అక్రమాలకు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లపై దౌర్జన్యాలకు ప్రేక్షక పాత్ర వహించకుండా సుమోటోగా కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబుకు దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేందర్రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కార్యదర్శి కాకమాను రవి, పట్రా బంగారం, కోలా జీవరత్నం, వేలూరి శ్రీనివాసరావు, దామవరపు నాగసాయి తదితరులు ఉన్నారు.







