పరిశీలించిన (క్రౌన్ హ్యూమన్ రైట్స్) నవంబర్ 22
గిద్దలూరు పురపాలక సంఘం నూతన చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశీలించారు.
గిద్దలూరు పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ల (సభ్యుల) ప్రమాణ స్వీకారం మరియు వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
స్థానిక గిద్దలూరు పురపాలక సంఘ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ జరుగుతున్న ప్రమాణ స్వీకారం మరియు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, తగిన మౌలిక వసతులు కల్పించాలని గిద్దలూరు మున్సిపల్ కమిషనర్‌కు పలు కీలక సూచనలు, సలహాలు అందించారు.
సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఏలూరు వెంకటరమణ బాబు, పురపాలక శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, మార్కాపురం.







