హైదరాబాద్, 11 September
మానవ హక్కుల పరిరక్షణే సమాజ ప్రగతికి పునాది అని పేర్కొంటూ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సౌత్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. బాధితులకు అండగా నిలుస్తూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకు నిరంతరం పోరాడటమే తమ ధ్యేయమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
మానవ హక్కుల రక్షణే సమాజ ప్రగతికి పునాది హైదరాబాద్లో ఘనంగా 'హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' సౌత్ ఇండియా ప్రధాన కార్యాలయం ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి. కార్యాలయాన్ని ప్రారంభించిన నేషనల్ సెక్రటరీ బి. బాల్ రెడ్డి. సౌత్ ఇండియా అధ్యక్షుడిగా ఎస్. పవన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా జి. వినోద్ కుమార్ నియామకం. క్రౌన్ హ్యూమన్ రైట్స్ హైదరాబాద్ ; బాధితులకు అండగా ఉంటూ, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల రక్షణకు నిరంతరం పోరాడటమే ధ్యేయంగా 'హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా' సౌత్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని నగరంలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంస్థ జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి హాజరుకాగా, నేషనల్ సెక్రటరీ బి. బాల్ రెడ్డి చేతుల మీదుగా నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా సంస్థ దక్షిణ భారతదేశ అధ్యక్షులుగా ఎస్. పవన్ ని నియమిస్తూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి నియామక పత్రం అందజేశారు. అలాగే సౌత్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్గా జి. వినోద్ కుమార్ ని నియమిస్తూ నేషనల్ సెక్రటరీ బి. బాల్ రెడ్డి ఉత్తర్వులు అందజేశారు.సంస్థలో కొత్తగా చేరిన సభ్యులకు జాతీయ ఉపాధ్యక్షులు బేతి తిరుమల రావు ఐడీ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లను అందజేశారు. సౌత్ ఇండియా ఉపాధ్యక్షులు రంగు శ్యామ్ సుందర్ చేతుల మీదుగా పలువురు సభ్యులకు నియామక పత్రాలు అందాయి.మహిళా సాధికారత, వారి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా సౌత్ ఇండియా మహిళా విభాగ అదనపు ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న చేతుల మీదుగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మహిళా ప్రతినిధులకు నియామక పత్రాలను అందజేశారు.కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రటరీ ముత్యాల బాబు మాట్లాడుతూ సంస్థ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియా జాయింట్ కన్వీనర్ సురేష్ తో పాటు సంస్థకు చెందిన వివిధ రాష్ట్రాల, విభాగాల ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











