జాండ్రపేట (క్రౌన్ హ్యూమన్ రైట్స్) సెప్టెంబర్ 07
ముఖ్య అతిథిగా మహేంద్రనాథ్
జాండ్రపేటలో జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో, దేశభక్తి భావనలతో నిర్వహించే జెండా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గణనాథుడి ఆగమనం (నగరోత్సవం) అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా జాండ్రపేటలో ప్రతిష్ఠించనున్న జెండా గణేష్ విగ్రహం ఈసారి 20 అడుగుల భారీ విగ్రహంగా భక్తులకు దర్శనమివ్వనుంది. గణనాథుడి ఆగమనాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా మహేంద్రనాథ్
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.
జెండా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందాలని కమిటీ ప్రతినిధులు కోరారు.












