పర్చూరు, 2026-06-05
పర్చూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించడంలో కాలువ అత్యంత కీలకమైనదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గానికి కాలువ ద్వారా అందే నీటి అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ఆయన కీలక చర్చలు జరిపారు.
పర్చూరు నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించడంలో NSPకాలువ అత్యంత కీలకమైనదని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గానికి కాలువ ద్వారా అందే నీటి అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో ఆయన కీలక చర్చలు జరిపారు.
కాలువ ద్వారా పర్చూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల పంటలకు సమయానికి నీరు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
కాలువ నీరు కేవలం వ్యవసాయానికే కాకుండా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాలకు కూడా ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. వేసవిలో, వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అధికారులతో చర్చించారు.
పర్చూరు నియోజకవర్గానికి నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా కాలువల పరిస్థితి, నీటి విడుదల, అవసరమైన మరమ్మతులు తదితర అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే ఏలూరి సమీక్షించారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
*ఎన్ఎస్పీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు మరియు నీటి సంఘం నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు












