క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-20
కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్వోల) నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్వోలుగా నియమించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ, అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి భార్య వసంత ఎన్నికల అధికారికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
కందుకూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్వోల) నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కందుకూరు మున్సిపాలిటీలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్వోలుగా నియమించడం పట్ల అభ్యంతరం తెలుపుతూ, అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వల్లూరి కోటేశ్వరరావు భార్య వసంత, ఎన్నికల అధికారికి శుక్రవారం కందుకూరు సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ ఒకే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎన్నికల విధులకు నియమించడం వల్ల ఎన్నికల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఎన్నికల ప్రక్రియపై అన్ని వర్గాలకు నమ్మకం కలిగేలా సమతుల్యతతో నియామకాలు చేపట్టాలని ఆమె తన వినతిలో పేర్కొన్నారు.
అదేవిధంగా, కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది తాము విధులు నిర్వహించే ప్రాంతంలోనే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా, ఎలాంటి పక్షపాతాలకు తావులేకుండా నిర్వహించేందుకు తమ వినతిని పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఎన్నికల అధికారిని కోరారు.







