క్రౌన్ హ్యూమన్ రైట్స్, ఢిల్లీ/చీరాల, 2026-11-21
కొత్తపేట గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చుండూరు వాసు నామినేషన్ దాఖలు చేశారు, గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యమని తెలిపారు.
త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొత్తపేట గ్రామ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా చుండూరు వాసు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా చుండూరు వాసు మాట్లాడుతూ కొత్తపేట గ్రామ సమగ్ర అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కులమతాలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
గతంలో ఎంపీటీసీగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఆ అనుభవంతో గ్రామ అభివృద్ధికి మరింత బాధ్యతాయుతంగా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికై కొత్తపేటను అభివృద్ధి పథంలో నడిపించడమే తన ఆకాంక్ష అని చుండూరు వాసు వెల్లడించారు.







