చైనాలో నిర్బంధంలో ఉన్న ఉయ్ఘర్ మానవశాస్త్రవేత్త, పరిశోధకురాలు డాక్టర్ రహిలే దావూత్కు జర్మనీలోని ఆక్సెల్ స్ప్రింగర్ ఫ్రీడమ్ ఫౌండేషన్ 2026 అవార్డ్ ఫర్ కరేజ్ను ప్రదానం చేసింది. జర్మన్ పార్లమెంట్లో జరిగిన కార్యక్రమంలో వరల్డ్ ఉయ్ఘర్ కాంగ్రెస్ () కార్యవర్గ అధ్యక్షురాలు రుషాన్ అబ్బాస్ ఆమె తరఫున అవార్డును స్వీకరించారు.
ఉయ్ఘర్ జానపద సంస్కృతి, పవిత్ర స్థలాలు, మత సంప్రదాయాలపై దశాబ్దాల పాటు పరిశోధనలు చేసిన రహిలే దావూత్ను చైనా అధికారులు 2020లో అదుపులోకి తీసుకున్నారు. 2023లో ఆమెకు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఆమె ఎక్కడ నిర్బంధంలో ఉన్నారో చైనా అధికారులు బహిరంగంగా ప్రకటించలేదు. ఆమెను వెంటనే విడుదల చేయాలని, ఆమె ఆచూకీని వెల్లడించి కుటుంబ సభ్యులతో సంప్రదింపులకు అవకాశం కల్పించాలని చైనాను కోరింది. అలాగే చైనాతో చర్చల సందర్భంగా రహిలే విడుదల అంశాన్ని లేవనెత్తి ఒత్తిడి తీసుకురావాలని జర్మనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.





