చీరాల, 2026-11-27
చీరాల మండలంలోని రామకృష్ణాపురం, సాల్మన్ సెంటర్ గ్రామ పంచాయతీల్లో కూటమి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. రామకృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పంద్రబోయిన అరుణ, సాల్మన్ సెంటర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుంటూరు మేఘనకు మద్దతుగా ఈ ప్రచారం జరిగింది.
చీరాల మండలంలోని రామకృష్ణాపురం, సాల్మన్ సెంటర్ గ్రామ పంచాయతీల్లో కూటమి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహించారు. రామకృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పంద్రబోయిన అరుణ, సాల్మన్ సెంటర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుంటూరు మేఘనకు మద్దతుగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి అభ్యర్థుల నాయకత్వాన్ని బలపరచాలని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసే అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజల ఆశీస్సులు, మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.







