బాపట్ల, 2026-09-07
పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో మార్టూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 మంది వరకు ఈ క్యాంటీన్‌ను వినియోగించుకుంటున్నారు. తక్కువ ధరకే భోజనం అందించడం ద్వారా ఆర్థికంగా కొంత ఊరటనిస్తోంది.
మార్టూరులో పేదల ఆకలికి అన్న క్యాంటీన్ అండ.. రోజూ 300–500 మందికి భోజన భరోసా! అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే యేలూరి శాంబశివరావుకు ప్రజల కృతజ్ఞతలు క్రౌన్ హ్యూమన్ రైట్స్ | మార్టూరు | పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో మార్టూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 మంది వరకు అన్న క్యాంటీన్‌ను వినియోగించుకుంటూ భోజనం చేస్తున్నారు. కూలీలు, చిరుద్యోగులు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, వివిధ పనుల నిమిత్తం మార్టూరుకు వచ్చే ప్రజలకు అన్న క్యాంటీన్ తక్కువ ధరకే భోజనం అందిస్తూ ఆర్థికంగా కొంత ఊరటనిస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో పేద, సామాన్య ప్రజలకు ఇలాంటి సదుపాయం ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యే యేలూరికి కృతజ్ఞతలు మార్టూరులో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే యేలూరి శాంబశివరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పేదలు, కూలీలు, సామాన్య ప్రజల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఉపయోగపడుతుండటంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు వందలాది మంది ఈ క్యాంటీన్‌ను వినియోగించుకుంటుండటమే దీని అవసరాన్ని తెలియజేస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. అన్న క్యాంటీన్ సేవలు నిరంతరం కొనసాగడంతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “ఆకలితో ఉన్న పేదవాడికి అందించే ఒక్క ముద్ద అన్నం.. మానవత్వానికి ప్రతీక” అన్న భావనకు మార్టూరులోని అన్న క్యాంటీన్ నిదర్శనంగా నిలుస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. పేద, సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా అన్న క్యాంటీన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు మార్టూరు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.












