మార్టూరు (క్రౌన్ హ్యూమన్ రైట్స్) ఆగస్టు 28
మార్టూరు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే మంచి నీటి చెరువును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గడంతో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ఆయన ఈ తనిఖీ చేపట్టారు.
మార్టూరు పట్టణ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చే మంచి నీటి చెరువును ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరిశీలించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో చెరువులో నీటి నిల్వలు తగ్గుతున్న పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాలు కురిసి చెరువులోకి సమృద్ధిగా నీరు చేరే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి నిల్వల పరిరక్షణపై అధికారులతో చర్చించారు.
అదేవిధంగా, మంచి నీటి చెరువు చుట్టూ ప్రజలు వాకింగ్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరలోనే చెరువు పరిసరాల్లో ఓపెన్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు.
ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం, వాకింగ్, వ్యాయామ సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచి నీటి చెరువు పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.












