కందుకూరు, 2026-11-27
కందుకూరు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ చేస్తున్న రిగ్గింగ్ ఆరోపణలపై తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరించలేకే బుర్రా ఈ ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని ఆయన అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో కందుకూరు ప్రజల తీర్పును జీర్ణించుకోలేకే వైసీపీ ఇంచార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్ అన్నారు. వైసీపీ తమ ఓటమిని ముందే అంగీకరించిందని, దానిని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
కందుకూరు ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుని అభివృద్ధికి పట్టం కట్టేందుకు ముందుకు వచ్చి, శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుపై తమకున్న అభిమానాన్ని మరోసారి నిరూపించారని బెజవాడ ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లుకు దాదాపు 15వేల మెజారిటీ వస్తుందని, 40 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటి నుండి నిన్నటి పోలింగ్ వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు తీసుకున్న చర్యల పట్ల కందుకూరు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే, వైసీపీ ఇంచార్జ్ బుర్రా మరోసారి తన ఓటమిని జీర్ణించుకోలేకే రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి అసత్యాలను కందుకూరు ప్రజలు ఎంతమాత్రం నమ్మరని బెజవాడ ప్రసాద్ హితవు పలికారు.







