బాపట్ల, 8 September
కొత్త పింఛన్ల విషయంలో లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని క్రౌన్ హ్యూమన్ రైట్స్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ షేక్ మౌలాలి హెచ్చరించారు. పింఛన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మార్టూరు:“పింఛన్ ఇప్పిస్తానంటూ వచ్చే దళారులను నమ్మొద్దు”.. మోసపోతే బాధితులు అవుతారు. కొత్త పింఛన్ల విషయంలో లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని "క్రౌన్ హ్యూమన్ రైట్స్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ షేక్ మౌలాలి" గట్టిగా హెచ్చరించారు. “పింఛన్ నేను ఇప్పిస్తాను.. నాకు మీ పత్రాలు ఇవ్వండి.. కొంత ఖర్చు అవుతుంది” అంటూ ఎవరైనా చెప్పినా వారి మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. పింఛన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం, ఆధార్ తదితర ముఖ్యమైన పత్రాలను తీసుకోవడం వంటి మోసాలకు పాల్పడే దళారుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పింఛన్ ఇప్పిస్తామంటూ ఎవరైనా డబ్బులు అడిగినా, వ్యక్తిగత పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని కోరినా వెంటనే అప్రమత్తం కావాలి. అధికారిక ప్రక్రియకు విరుద్ధంగా ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ముఖ్యమైన పత్రాలను అపరిచిత వ్యక్తులకు అప్పగించవద్దని షేక్ మౌలాలి స్పష్టం చేశారు.అర్హులైన లబ్ధిదారులు నేరుగా సంబంధిత సచివాలయాన్ని సంప్రదించి, అధికారుల సూచనల మేరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.












