మదనపల్లె, 2026-11-29
పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివారం జరిగిన గ్రామపంచాయతీ రెండో విడత పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ కలెక్టరేట్లోని ప్రధాన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లు, సౌకర్యాలు, నిర్వహణ తీరును అధికారులతో సమీక్షించారు.
పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి కొనసాగిన గ్రామపంచాయతీ రెండో విడత పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ కలెక్టరేట్లోని ప్రధాన కంట్రోల్ రూమ్ నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిశితంగా పరిశీలించారు.
కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రధాన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, అక్కడి నుంచి వివిధ పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల క్యూలైన్లను, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను, పోలింగ్ నిర్వహణ తీరును కంట్రోల్ రూమ్‌లో ఉన్న నోడల్ అధికారులు, హౌసింగ్ మరియు మెప్మా పీడీలు రమేష్ రెడ్డి, లక్ష్మీదేవిలతో సమీక్షించారు.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో పోలింగ్ నిర్వహణను సమీక్షిస్తూ, ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిపిఓ రాధమ్మ, హౌసింగ్, మెప్మా పీడీలు రమేష్ రెడ్డి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.







