గుంటూరు, 2026-11-27
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది నుండి వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను ఆయన స్వీకరించారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఈరోజు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బంది నుండి వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా ఎస్పీ తెలిపారు. సిబ్బంది సమస్యలు సకాలంలో పరిష్కారమైతే విధి నిర్వహణలో మరింత సామర్థ్యం, నిబద్ధత, ఉత్సాహం పెరుగుతాయని పేర్కొన్నారు. బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలనా నిర్ణయాలు శాఖ నిబంధనలు, ఖాళీలు, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు.
పోలీస్ సిబ్బంది ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించిన ఎస్పీ, సిబ్బంది సంక్షేమం మెరుగుపడితేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించగలమని అన్నారు.
అదేవిధంగా ప్రతి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావం మరింత పెంపొందేలా సేవలందించాలని సూచించారు.
పోలీస్ శాఖ ఒక కుటుంబం. పరస్పర సహకారం, సమన్వయం, గౌరవంతో పనిచేసినప్పుడే సంస్థ మరింత బలోపేతం అవుతుంది. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని వకుల్ జిందాల్ పేర్కొన్నారు.





