అన్నమయ్య, 2026-11-29
అన్నమయ్య జిల్లాలో ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో, ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడిని హెడ్ కానిస్టేబుల్ శంకర్ రాజు, కానిస్టేబుల్ జగన్ చేతులపై ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు.
అన్నమయ్య జిల్లాలో ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాయ్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో ఉన్న రాయచోటికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శంకర్ రాజు, కానిస్టేబుల్ జగన్, ఓటు వేసేందుకు వచ్చిన దివ్యాంగుడికి అండగా నిలిచారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడిని, ఆ ఇద్దరు పోలీసులు చేతులపై ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి, ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించారు.
ఒకవైపు ఎన్నికల విధులను నిర్వహిస్తూనే, మరోవైపు దివ్యాంగుడికి సహాయం చేసిన ఈ పోలీసుల సేవపై పలువురు అభినందనలు తెలిపారు. తమ ఖాకీ దుస్తుల వెనుక మానవత్వం కూడా ఉందని పోలీసులు మరోసారి చాటుకున్నారు.
ఇదే తరహాలో, తొలి విడత ఎన్నికల్లో దేవపట్ల రెడ్డివారిపల్లెలో వృద్ధ మహిళను ఏఎస్ఐ గంగరాజు చేతులపై ఎత్తుకొని ఓటు వేయించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అందిస్తున్న సహాయాన్ని తెలియజేస్తున్నాయి.







