చంద్రగిరి, 2026-11-25
తిరుపతి రూరల్ మండలంలో పూతలపట్టునాయుడుపేట జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం స్కిడ్ అయి లారీ కిందపడి జగదాంబ (50) అనే మహిళ మృతి చెందింది.
తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టునాయుడుపేట జాతీయ రహదారిపై హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా ద్విచక్ర వాహనం స్కిడ్ అవడంతో ఓ మహిళ లారీ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళితే.. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా, హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో బైక్పై ఉన్న ఎంఆర్ పల్లికి చెందిన జగదాంబ (50) పక్కనే వెళ్తున్న లారీ కింద పడిపోయారు. లారీ చక్రం ఆమె తలపై నుంచి వెళ్లడంతో జగదాంబ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ప్రమాదానికి కారణాలు
రేణిగుంటసి.మల్లవరం మార్గంలో జరుగుతున్న సిక్స్వే పనుల కారణంగా రోడ్డు అస్తవ్యస్తంగా మారిందని, వర్షపు నీరు నిలిచి ఉండటం, గుంతలు ఏర్పడటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.







