చీరాల, 2026-06-27
రోటరీ క్లబ్ అధ్యక్షుడికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పూర్తి సహకారం అందించి, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని రోటరీ జిల్లా మాజీ గవర్నర్లు (పి డి జి ఎస్) పిలుపునిచ్చారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం రాత్రి పలు రోటరీ క్లబ్‌ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్రైనింగ్ సెమినార్ జరిగింది.
రోటరీ క్లబ్ అధ్యక్షుడికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పూర్తి సహకారం అందించి, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని రోటరీ జిల్లా మాజీ గవర్నర్లు (పి డి జి ఎస్) పిలుపునిచ్చారు.
చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం రాత్రి చీరాల, క్షీరపురి, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, పంగులూరు రోటరీ క్లబ్‌ల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ట్రైనింగ్ సెమినార్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రొటేరియన్స్ డాక్టర్ బాబూరావు, కరణం శ్రీనివాస బాబు, జాలాది కృష్ణమూర్తి, తిరుమలశెట్టి లక్ష్మీ ప్రతాప్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రొటేరియన్స్ పీడీజీ వడ్లమాని రవి, టి. రాజశేఖరరెడ్డి, పి. శివన్నారాయణ, జె. మురళీ హాజరై మాట్లాడారు. రోటరీ క్లబ్‌ల బలోపేతానికి ప్రతి సమావేశానికి సభ్యులందరూ హాజరుకావాలని, కొత్త సభ్యులను చేర్చుకోవాలని, రోటరీ ఇంటర్నేషనల్‌కు చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించాలని సూచించారు. అలాగే నిధులు సమకూర్చుకుని పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సి.హెచ్. బాల వెంకటేశ్వరరావు, పోలుదాసు రామకృష్ణ, గుర్రం రాఘవరావు, జి.వై. ప్రసాద్, సుభాషిణి, బండారుపల్లి హేమంత్ కుమార్, శీరాం రమేష్, సురేష్ తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు.












